దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు కూడా వందల నుంచి వేల కేసుల వరకు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని అధికారులు చెప్పారు. ఢిల్లీతో పాటుగా దాని పరిసర నగరాల్లో నివశిస్తున్న మెట్రోరైలు ఉద్యోగులు కూడా కరోనా బారిన పడినట్టు అధికారులు వివరించారు. 

 

అయితే ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే తాము... అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని సర్వీసులను నడిపిస్తామని అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ మెట్రోరైలు మస్కట్, మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టరును అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మెట్రోరైలు కార్యాలయాలు, రైల్వేస్టేషన్లను శానిటైజ్ చేయించి జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: