ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన బ్యాంకు ఏజీఎంను పాలకవర్గం సస్పెండ్ చేసింది. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కోఆపరేటివ్ బ్యాంకులో ఏజీఎం హోదాలో పని చేసే ఉద్యోగిని సస్పెండ్ అయింది. సోషల్ మీడియాలో సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్లే సస్పెండ్ చేశామని అధికారులు చెబుతున్నారు. గతంలో సీఎం జగన్ పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాను నియంత్రించవచ్చని చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకంగా పోస్టులు చేయడంతో ఏజీఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారి విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏజీఎం మాధవి తన పిల్లలు పోస్ట్ చేశారని చెబుతోంది. సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: