OTT vs థియేటర్స్  సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు వాటికీ ఎప్పుడు అనుమతులు వస్తాయో కూడా తెలియదు ..ఒకవేళ సినిమా థియేటర్లు తెరుచున్నా జనాలు వస్తారో రారో అన్న అనుమానాలు ఎదురౌతున్నాయి. సినిమాలపై భారీగా పెట్టుబడి పెట్టిన ప్రతి నిర్మాత మనసులో మెదులుతున్న ఘర్షణ ఇది. అయితే ఎక్కువ శాతం నిర్మాతలు థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

 

వారు OTT అనే పదం ను వినడానికి ఇష్టపడడం లేదు...దానిగురించి మాట్లాడడానికి వారు సుముఖంగా ఉన్నట్టు లేరు. కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం వారిసినిమాలను పెద్ద మొత్తం లో OTT ద్వారా విక్రయించడానికి చూస్తున్నారు కుదరని పక్షంలో ఇతర ప్లాట్ ఫామ్ ద్వారా అమ్మడానికి చూస్తున్నారు. అయితే ఇప్పుడు చిన్న నిర్మాతలు OTT ద్వారా సినిమాలను విక్రయించడానికి నిర్మాతల మండలిలో అనుమతులు పొంద చూస్తున్నారు. వివిధ OTT ఫ్లాట్ ఫామ్ ద్వారా విక్రయించడానికి ప్రత్యేకమైన & ఏకరీతి రేటు ఇవ్వడానికి అనుమతులు కోరుతున్నారు. అయితే నిర్మాతల మండలి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: