టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8 తరువాత మిగతా ప్రాంతాల్లో శ్రీవారి లడ్డూలను విక్రయించబోమని అన్నారు. అలిపిరి నుంచి కాలినడక భక్తులకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నామని తెలిపారు. అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందని అన్నారు. ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నామని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఇప్పుడే అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. 
 
8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ రన్ ఉంటుందని.... 10న దర్శనానికి స్థానికులకు అనుమతి ఇస్తామని అన్నారు. ప్రతి భక్తుడు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలినడకన వచ్చే భక్తులకు అనుమతివ్వనున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: