దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేసింది. తాజాగా కేంద్రం ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల్లో ప్రార్థనా మందిరాలకు ఈ నెల 8 నుంచి అనుమతులు ఇచ్చింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అలిపిరి, తిరుపతిలో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదని చెప్పారు. ఈ నెల 11 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. 
 
ప్రతిరోజూ 7,000 మందికి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు అనుమతి లేదని అన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కాలినడకన అనుమతి ఇస్తున్నామని... ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దర్శనానికి అనుమతులు ఇస్తామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: