గతేడాది నవంబర్లో వివాదాస్పద భూ భాగమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్య భూభాగం హిందువులకు చెందుతుంది అంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేసి రామమందిర నిర్మాణానికి భూమి పూజ కూడా చేసిన విషయం తెలిసిందే

 


 ఇదిలా ఉంటే తాజాగా బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టు గురువారం విచారించారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలాలను సేకరించేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. ఇక వీరిలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కె అద్వానీ, కళ్యాణ్ సింగ్,  ఉమాభారతి,  బ్రిజ్  భూషణ్ చరణ్ సింగ్, సాక్షి మహారాజు ఉన్నారు... ఇందులో బాల్ ఠాక్రే పేరు కూడా ఉండగా ఆయన మరణానంతరం ఆయన పేరును తొలగించారు. కొంతమంది 1992 డిసెంబర్ 6 వ  తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత ఏకంగా రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించిన  సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: