తమ  అభిమాన హీరోల బర్త్ డే  వస్తుందంటే చాలు అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు . హీరోల బర్త్ డే  రోజు తమ కొత్త సినిమాలకు సంబంధించి అభిమానులకు ఏదో ఒక గిఫ్ట్ చిత్రబృందం విడుదల చేస్తుంది. అయితే జూన్ 10 వ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఉన్న విషయం తెలిసిందే  ఈ నేపథ్యంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

 అయితే బాలకృష్ణ పుట్టినరోజునాడు అభిమానులకు పెద్ద బహుమతి ఉండనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్  విడుదల చేయడంతో పాటు సినిమా టైటిల్ కూడా ఆ రోజే విడుదల చేయనున్నారు.దీనికి  సంబంధించి తాజాగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టగా ప్రస్తుతం అది వైరల్ గా మారిపోయింది. అయితే మొన్న ఎన్టీఆర్ అప్డేట్ గురించి వేచి చూసి అభిమానులు నిరాశ చెందినప్పటికీ ఇప్పుడు బాలకృష్ణ మాత్రం డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: