ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు.. కానీ ఇప్పుడు బతుకు నేర్చిన బడి పంతులు.  అసలు పంతులు జాబ్ వస్తే నక్క తోక తొక్కినట్టే అంటున్నారు.  సెలవులు.. దర్జాగా జాబు.. గౌరవమైన వేతనం.. ఇంతకన్నా ఏం కావాలంటున్నారు.  ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు బాగానే వస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఓ లేడీ టీచర్ మరీ దురాశకు పోయి దొరికిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయురాలు అనామిక శుక్ల పలు పాఠశాలల్లో పని చేస్తున్నట్లు ఆనలైన్‌ రికార్డుల ద్వారా తెలిసింది.  ఏకకాలంలో 25 ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తూ సుమారు రూ.కోటి సంపాదించిన ఓ టీచర్‌ వ్యవహారం బయటపడింది. టీచర్లకు సంబంధించిన డేటా బేస్ సిద్ధం చేస్తుండగా, అమ్మడి దురాశ బయటపడింది.

 

ఈ పాతిక స్కూళ్ల రికార్డులన్నీ పరిశీలిస్తే... అక్కడ పనిచేసే టీచర్ల జాబితాలో అనామిక పేరు ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఆమెకు ప్రతి స్కూల్ నుంచి జీతం అందుతున్నట్టు తెలుసుకున్నారు.   ఈ ఏడాది మార్చిలో దీని గురించి ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ విషయం బయటపడిన నాటి నుంచి ఆ ఉపాధ్యాయురాలు కనిపించకుండాపోయినట్లు సమాచారం.  అలాగే అన్ని స్కూళ్లతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలు పాటు కోటి రుపాయలు జీతంగా తీసుకున్నట్లు బయటపడింది.  ఒకట్రెండు స్కూళ్లలో బయోమెట్రిక్ హాజరు మేనేజ్ చేయొచ్చని, ఇన్ని స్కూళ్లలో వేలిముద్రల విషయంలో ఎవరికీ అనుమానం రాలేదంటే దీంట్లో ఇంకెవరి ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ అధికారులు విచారణ సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: