దేశం మొత్తం ఇప్పుడు కరోనా పేరు చెబితేనే గుండె గుభేల్ మంటుంది.  ఎక్కడ కరోనా దాగి ఉందో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా పేరు చెబితేనే హడలిపోతున్నారు.  లాక్ డౌన్ మొదలు ఇప్పటికీ చాలా మంది ఇల్లు వదలి బయటకు రావడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కు కరోనా పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. దీంతో తమ సీఎంకు కరోనా లేదని అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే, నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన టూరిజం మంత్రికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.

 

ఈ పరీక్షల్లో, ఆయనకు పాజిటివ్ అని తేలింది. అంతే ఆ క్షణం నుంచి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్  సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లపోయారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ అని నిర్ధారణ అయింది. నెగెటివ్ అని తేలినప్పటికీ ముఖ్యమంత్రి ఇంకా సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. మరోవైపు ముగ్గురు మంత్రులు మాత్రం స్వీయ నిర్బంధం నుంచి బయటకు వచ్చి, విధులను నిర్వహించారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: