విజయ్ దేవరకొండ లాక్‌డౌన్‌ సమయంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడానికి దేవరకొండ ఫౌండేషన్ స్థాపించిన విషయం తెలిసిందే. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఏకంగా ఎంతోమందికి హెల్ప్ చేశారు యువ హీరో విజయ్ దేవరకొండ. ఏ యువహీరో చేరి సాహసాన్ని చేసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు విజయ్ దేవరకొండ. 

 


 ఏకంగా 17 వేల పైచిలుకు మధ్యతరగతి కుటుంబాలు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందాయి. మిడిల్ క్లాస్ ఫండ్  స్థాపించిన  దేవరకొండ తన పొదుపు నుంచి ఏకంగా 20 లక్షలు  ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపు లో భాగంగా అన్ని వ్యాపారాలు ఉద్యోగాలు కూడా మొదలవుతున్న  నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మూసివేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ధృవీకరించబడింది. తాను చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమాన్ని 535 మంది వాలంటీర్లు కుటుంబాలకు సాయం చేయడానికి దేవరకొండ ఫౌండేషన్ లో చేరారు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: