భారత క్రికెట్ మాజీ  అల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడంటూ సోషల్ మాధ్యమాలలో వచ్చిన వార్తలదృష్ట్యా శుక్రవారం ట్విట్టర్ వేదికగా యువరాజ్ సింగ్ క్షమాపణలు తెలియజేశాడు. తాజాగా ఇండియన్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ రోహిత్ శర్మతో కలసి యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా లైవ్ చాట్ చేశారు. అయితే ఈ సందర్భంగా వీరు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ కులానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం సోషల్ మాధ్యమాలలోవైరల్ అవ్వడంతో యువరాజ్ పై విమర్శల వెల్లువ ఉవ్వెత్తున ఎగసిపడింది. దింతో యువరాజ్ సింగ్ సారీ చెప్పారు.

 

 
‘నేనెప్పుడూ కులం, రంగు, లింగ బేధాల గురించి పట్టించుకోను. ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే పరితపిస్తా. పరస్పర గౌరవ మర్యాదలతో నడుచుకోవాలని భావిస్తా. అందరికీ గౌరవం ఇస్తా. నా సహచరుడితో మాట్లాడుతున్నప్పుడు చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. ఏది ఏమైనా బాధ్యతాయుతమైన భారతీయుడిగా నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. నా వ్యాఖ్యల పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నా. దేశంపై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు’ యువరాజ్ తాజా ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: