ప్రస్తుతం ప్రపంచ మహమ్మారి కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలు సామాన్యులు పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరికీ ఈ మహమ్మారి వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలు దేశాల ప్రధానులు లకు సైతం సోకి  సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

 

 తాజాగా  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అండర్వరల్డ్ డాన్ కి  కూడా ఈ మహమ్మారి వైరస్ భయం తప్పలేదు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు అతని భార్యకు కరోనా వైరస్ పరీక్షలు చేయగా ఆ పరీక్షలో వారిద్దరికీ పాజిటివ్ వచ్చినట్లుగా ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దావుద్  ఇబ్రహీం కి కరోనా సోకడంతో అతని సిబ్బందిని కాపలాదారులను  కూడా క్వారంటైన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ... పాక్  మీడియాలో మాత్రం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: