నందమూరి నటసింహం బాలకృష్ణజూన్ 10న జరుపుకోబోయే బర్త్‌డే. ఈ పుట్టినరోజుతో ఆయన 60 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సంద‌ర్భంగా నిన్న విడుద‌ల చేసిన సీడీపీ వైర‌ల్ అవుతోంది. నందమూరి అభిమానులు బాలయ్య బర్త్‌డే సంబరాలు సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు అభిమానులు. తాజాగా ఆయన బర్త్‌డే సంబంధించిన డీపీని విడుదల చేశారు. కొందరు ప్రముఖులు ఈ విడుదల కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ డీపీలో బాలయ్య శ్రీకృష్ణదేవరాయలు గెటప్‌లోనూ, అలాగే ‘నిప్పురవ్వ’లోని మాస్ లుక్‌లోనూ ఉన్నారు. వెనుక జై బాలయ్య, హిందూపూర్, బసవతారకం వంటి పదాలతో పాటు బాలయ్య తల్లిదండ్రుల బొమ్మలు కూడా ఉన్నాయి.

 

‘‘ఆయనకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వెల్తారు ఏమో, అయిన వాళ్ళకి వస్తే మాత్రం అరక్షణం కూడా ఆలోచించరు..’’ అని తెలుపుతూ ఈ డీపీ విడుదల చేశారు. ప్రస్తుతం బాలయ్య బర్త్‌డే డీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బ్రాహ్మ‌ణి ట్వీట్ చేశారు. *నా తండ్రి 60 వ పుట్టినరోజు సిడిపిని విడుదల చేసినందుకు గర్వంగా ఉంది ... నాన్న‌కు ఇంకా చాలా గర్జించే సంవత్సరాలు కావాలని కోరుకుంటున్నాను !! * అంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: