క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చైనా, అమెరికా మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. క‌రోనా మహమ్మారి మధ్య యూఎస్ క్యారియర్‌లను బీజింగ్ అడ్డుకోవడంతో జూన్ 16 నాటికి చైనా ప్రయాణీకుల విమానాల‌ను అమెరికాకు రాకుండా నిషేధించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన విష‌యం తెలిసిందే. దీంతో వెన‌క్కి త‌గ్గిన చైనా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

 

త‌మ‌దేశంలోకి మరిన్ని విదేశీ విమానాల‌ను అనుమతించడానికి స‌డ‌లింపులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో అమెరికా కూడా కీల‌క  ప్ర‌క‌ట‌న చేసింది. చైనా ప్రయాణికుల విమానాల‌ను వారానికి రెండు నడపడానికి అమెరికా అనుమతిస్తుందని అమెరికా రవాణా శాఖ శుక్రవారం తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: