జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్ల కొవిడ్‌ లాంటి వైరస్‌లు విస్తరిస్తున్నాయని అంటున్నారు ఐఈఐ జాతీయ అధ్యక్షుడు నరేందర్‌సింగ్‌. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపధ్యంలో ది ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో జూమ్‌ క్లౌడ్‌ మీటింగ్‌ యాప్‌లో ‘జీవవైవిధ్యం’ అనే అంశంపై సదస్సు జరగగా దీనికి హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

ప్రపంచం కొవిడ్‌ వైరస్‌ గుప్పిట్లో ఉందని, దాని నుంచి బయటపడాలంటే జీవవైవిధ్యాన్ని రక్షించుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల అనేక ఉపద్రవాలు వచ్చిపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. మానవ తప్పిదాల వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని దారుణాలు జరుగక ముందే తేరుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: