మియా  మాల్కొవా ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా వస్తున్న చిత్రం క్లైమాక్స్. ఇప్పటికే దీనికి సంబంధించిన  లుక్స్, వీడియో లు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  దీనికి సంబంధించిన రెండు ట్రైలర్లను వర్మ విడుదల చేసాడు. వాటికి మంచి స్పందన వచ్చింది సోషల్ మీడియా. 

 

ఇక ఈ సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు వర్మ. సాయంత్రం 9 గంటలకు ఇది శ్రేయాస్ ఈటీ అనే యాప్ లో విడుదల అవుతున్నట్టు వర్మ ట్వీట్ చేసారు. మరో 12 గంటల్లో సినిమాను విడుదల చేస్తున్నామని ఒక వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కాగా వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: