బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, నటులు ఇప్పుడు కరోనా వైరస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ తో పలువురు ప్రముఖులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రముఖ గాయకుడు వాజిద్ ఖాన్ కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోగా తాజాగా నిర్మాత అనీల్ సూరి కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

 

ఈ విషయాన్ని ఆయన సోదరుడు రాజీవ్ సూరి వెల్లడించారు. జూన్‌ 2 నుంచి హై ఫీవర్‌తో బాధపడుతున్నారని... ఒక్క రోజులోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని... ముంబై లీలావతి ఆస్పత్రికి హిందూజా ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా వాళ్ళు జాయిన్ చేసుకోలేదు అని ఆ తర్వాత మరో ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా ఆయన ఆరోగ్యం అక్కడి నుంచి క్రమంగా విషమించింది అని రాజీవ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: