తెలంగాణాలో ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాగునీటి కష్టాలను తీర్చడానికి గానూ కీలక అడుగులు వేస్తుంది. సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటానికి గానూ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లను ఓపెన్ చేసిన తెలంగాణా సర్కార్... ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. 

 

ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 9.36 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లివద్ద గోదావరిపై దుమ్ముగూడెం బ్యారేజ్ దిగువన సీతమ్మ బ్యారేజ్ నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనితో ఆయా జిల్లాలకు తాగు సాగునీరు అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే సాగునీటి ప్రాజెక్ట్ లను తెలంగాణా సర్కార్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని కేవలం 24 నెలల్లోనే పూర్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: