కరోనా ఆర్ధిక కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది అందరికి తెలిసిందే. అనేక వ్యాపార సంస్థలు ఇప్పుడు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గానూ ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే ఫలితం మాత్రం పెద్దగా కనపడటం లేదు. అయితే దేశంలో ఆర్ధిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చెయ్యాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 

 

ఇటీవల కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజి పై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ధిక వ్యవస్థ కష్టాలను జాతీయ మీడియా కథనం రాయగా దానిని షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలకు మరియు ఎంఎస్‌ఎంఇలకు నగదు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థను వేగంగా  నాశనం చేస్తోందని... ఇది డెమోన్ 2.0.  అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: