ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఈ నెల 9 న మధ్యాహ్నం 3 గంటలకు సినీ పెద్దలు కలవనున్నారు. అయితే దీనికి సంబంధించి బాలకృష్ణ కు ఆహ్వానం ఇచ్చినా సరే ఆయన మాత్రం వచ్చేది లేదని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ వివరించారు. ప్ర‌ముఖ నిర్మాత డి.రామానాయుడు జ‌యంతి వేడుక‌ల్లో మాట్లాడిన ఆయన సినిమా షూటింగ్స్ ప్రారంభించ‌డానికి అందరం ప్రభుత్వాలతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే అన్నారు. 

 

అందులో భాగంగా జూన్ 9 మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌గారి అపాయింట్‌మెంట్ దొరికిందన్నారు. ఈ మీటింగ్‌కు రావాలంటూ నంద‌మూరి బాల‌కృష్ణ‌గారికి నేను ఫోన్ చేసి ఆహ్వానించానని చెప్పిన ఆయన... అయితే జూన్ 10న బాలకృష్ణ‌గారి పుట్టినరోజు అని... ఆయ‌న కాస్త బిజీగా ఉండ‌టం వ‌ల్ల రాలేక‌పోయే అవ‌కాశాలున్నాయన్నారు. చిరంజీవిగారు, ఇత‌ర పెద్ద‌లు వై.ఎస్‌.జ‌గ‌న్‌గారిని క‌లుస్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: