తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటుల వారసులు హీరోలు ఇతర విభాగాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో తెలుగు లో ఎన్నో విలన్ పాత్రలు వేసిన చలపతి రావు తనయుడు రవిబాబు ‘అల్లరి’ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.  ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే ఎన్నో చిత్రాల్లో విలన్, కమెడియన్ గా నటిస్తూ వస్తున్నారు.  కేవలం ఇండస్ట్రీ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా రవిబాబు తనదైన మార్క్ చాటుకుంటున్నారు. కొన్నాళ్ల కిందట పందిపిల్లతో ఏటీఎం వద్దకు వచ్చి వార్తల్లోకెక్కారు. తాజాగా, కరోనా నేపథ్యంలో ఓ సూపర్ మార్కెట్ వద్ద తనదైనశైలిలో నవ్వులు పూయించారు. 

 

సూపర్ మార్కెట్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద రవిబాబు లోపలికి వెళుతుండగా సెక్యూరిటీ గార్డు థర్మల్ స్కానర్ తో రవిబాబును చెక్ చేయగా, "అయిపోయిందా... ఇప్పుడు నేను చెక్ చేస్తాను" అంటూ తన జేబులోంచి థర్మల్ స్కానర్ తీసిన రవిబాబు ఆ సెక్యూరిటీ గార్డుకు టెంపరేచర్ చెక్ చేయడం... ఆపై, "నీకేమీ లేదు, నువ్వు ఓకే" అని చెప్పి సూపర్ మార్కెట్లోకి సీరియస్ గా వెళ్లిపోవడం వీడియోలో చూడొచ్చు. ఇలా రవిబాబు అక్కడ ఉన్నవారినే కాదు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: