కేరళలో గర్భిణి ఏనుగు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పైనాపిల్లో బాంబులు పెట్టి  ఏనుగుకు ఇవ్వడంతో అది తిన్న ఏనుగు  తీవ్రంగా గాయపడి ఏకంగా ఒక నది లోకి వెళ్లి అక్కడే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారగా సేవ్ ఎనిమల్స్ అనే నినాదం కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణను కూడా ముమ్మరం చేశారు అధికారులు. గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

 

 ఈరోజు వరకు పైనాపిల్లో బాంబులు నింపి ఇవ్వడం కారణంగా అది తిని ఏనుగు మరణించిందని అందరూ అనుకోగ... తాజాగా టపాకాయలు నింపిన కొబ్బరికాయ తిని ఆ ఏనుగు మరణించింది అంటూ అటవీశాఖ అధికారి సునీల్ వెల్లడించారు. కాగా తాజాగా అటవీశాఖ అధికారి చెప్పిన విషయం సంచలనంగా  మారిపోయింది. ఇక ఈ ఘటన తర్వాత మనుషుల్లో మానవత్వం పూర్తిగా కరువైపోయింది అంటూ ఎంతో మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మూగ జీవాలపై కనీసం ప్రేమ దయ జాలి అనేది చూపించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: