తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్షలపై గందరగోళం కొనసాగుతోంది. హైకోర్టు పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉందా...? అని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా పరీక్షలు నిర్వహించడం సాధ్యమవుతుందా..? లేదా..? చెప్పాలని అడ్వకేట్ జనరల్ ను కోరింది. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వాన్ని అడిగి వివరాలు చెబుతానని చెప్పారు. 
 
హైకోర్టు తదుపరి విచారణను ఈరోజు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. విద్యాశాఖ ఇప్పటికే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం పరీక్షలను నిర్వహించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: