దేశంలో చాలా మంది కేటుగాళ్ళు డబ్బు సంపాదించడం కోసం దేనికైనా సిద్ద పడుతున్నారు.  ఈజీ మనీ కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతున్నారు.. దాని కోసం టెక్నాలజీ కూడా వాడుతున్నారు.  ఆ మద్య దేశంలో కరోనాతై డబ్బు ముట్టుకోవడానికే భయపడిపోయారు.. కానీ ఇప్పుడు డబ్బు సంపాదన కోసం అడ్డ దారులు పడుతున్నారు. తాజాగా ఏపిలో సర్టిఫికెట్‌ను జిరాక్స్ తీసినంత సులభంగా రెండువేలు, 500 నోట్లను అచ్చేస్తున్న ముఠా బండారం బయపడింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలులో నకిలీ నోట్లను ముద్రిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.49 దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపురం గ్రామానికి చెందిన నలుగురు ఈ నిర్వాకం వెలగబెడుతున్నారు. 

 

నారాయణపురం గ్రామానికి చెందిన నలుగురు ఈ నిర్వాకం వెలగబెడుతున్నారు. తెల్ల కాగితాలపై కలర్ ప్రింటర్ ద్వారా  నోట్లు అచ్చేస్తున్నారు. వాటిని పెద్ద మొత్తంలో కాకుండా చిన్న షాపుల్లో అసలు నోట్లతో కలిపి మార్పిడి చేస్తున్నారు.   అయితే వీరి దందా బాగా సాగుతుందన్న సమయంలో వీరి గురించి ఎవరో పోలీసులకు ఉప్పదించారు. శుక్రవారం పోలీసులు దాడిచేసి నోట్లను, కలర్ ప్రింటర్ ను స్వాధీనం చేసుకున్నారు.  అయితే ఈ నేరాలు తాము యూట్యూబ్ లో చూసి నేర్చుకొని ప్రింట్ చేసినట్లు తెలిపారు.  మద్యం, ఇతర చెడు అలవాట్లకు లోనైన నిందితులు ఖర్చుల కోసం ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: