టాయ్‌లెట్ సీటు నుంచి బొమ్మల వరకూ అన్నీ చైనా ఉత్పత్తులే అని, ఈ పరిస్థితి మారాలని ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా అన్నారు. చైనాను భారత్ లో అన్ని రంగాల్లోనూ బహిష్కరించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా... ఇలా అన్ని రంగాల్లో బహిష్కరిస్తేనే వారు దార్లోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 

 

దేశ సరిహద్దులను పరిరక్షించ గలిగే పూర్తి సత్తా మన సైన్యానికి ఉందన్నారు ఆయన. చైనాను ఆయుధాలతో దెబ్బకొట్టే కంటే వస్తువులను బహిష్కరిస్తేనే దార్లోకి వస్తోందని పేర్కొన్నారు. మన దేశంతో చైనా 15 నుంచి 20 లక్షల కోట్ల వ్యాపారాన్ని చేస్తోందని ఈ సందర్భంగా ఆరోపించారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించే విషయంలో ప్రజలు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: