హైదరాబాద్ లో 15 లక్షలు  లంచం తీసుకుంటూ ఉండగా షేక్ పేట రెవెన్యు ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కారు . స్థల వివాదాన్ని పరిష్కరించడానికి గానూ 50 లక్షలను ఆయన డిమాండ్ చేసారు. దీనితో పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఆయనను 15 లక్షలు అడ్వాన్స్  తీసుకునే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. 

 

ఇక ఆయనతో పాటుగా ఎమ్మార్వో సుజాత, బంజారా హిల్స్ ఎస్సై పై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సుజాత ఇంట్లో 30 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ ఎస్సై ను కూడా అధికారులు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుని నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుజాత ఇంట్లో సోదాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: