కేంద్ర‌ మంత్రి పీయూష్‌ గోయల్‌‌కు మాతృవియోగం జరిగింది. వృద్ధాప్యం కార‌ణంగా ఆయన తల్లి చంద్రకాంత‌ గోయల్‌ మృతి చెందారు. ఈ బాధాక‌ర‌మైన స‌మాచారాన్ని పీయూష్‌ గోయల్‌ తన సోషల్ ఖాతా ద్వారా పంచుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ముంబయిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పియూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన మాతృమూర్తి వృద్ధాప్య కారణాలతో మరణించినట్టు వెల్లడించారు. ఆమె తన యావత్ జీవితాన్ని ప్రజాసేవకు అంకితమిచ్చిందని తెలిపారు. తన తల్లి జీవితం మొత్తం  ప్రజలకు సేవచేయడానికే అంకితం చేసిందని, ఇతరులను కూడా అదేవిధంగా సమాజ శ్రేయస్సుకు పాటుపడేలా ప్రేరేపించింద‌ని పీయూష్ గోయ‌ల్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. 

 

అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ అనంతరం చంద్రకాంత గోయల్ ముంబయిలో కార్పొరేటర్ గా ప్రస్థానం ఆరంభించారు. ఆపై ముంబయిలోని మాతుంగ అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, చంద్రకాంత గోయల్ భర్త దివంగత వేద్ ప్రకాశ్ గోయల్ సుదీర్ఘకాలం బీజేపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు. ఆయన వాజ్ పేయి సర్కారులో షిప్పింగ్ మంత్రిగా పనిచేశారు. పీయూష్ గోయ‌ల్ తండ్రి, దివంగత వేద్‌ ప్రకాష్‌ గోయల్ సైతం బీజేపీ జాతీయ కోశాధికారిగా, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో షిప్పింగ్‌ మంత్రిగా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: