పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఒక కోర్ట్ నోటీసులు ఇచ్చింది. పరువు నష్టం కేసులో ముందస్తు విచారణ చేపట్టాలని కోరుతూ దీన్ని దాఖలు చేసిన పీఎంఎల్-ఎన్ పార్టీ చీఫ్ షాబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఈ నోటీసులు ఇచ్చింది కోర్ట్. 2017 ఏప్రిల్‌లో ఇమ్రాన్ షాబాజ్ షరీఫ్ పెద్దన్నయ్య, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టులో దాఖలైన పనామా పేపర్ల కేసును ఉపసంహరించుకుంటే 61 మిలియన్ డాలర్లు ఇస్తామని షాబాజ్ ఆఫర్ చేసారని ఇమ్రాన్ వ్యాఖ్యలు చేసారు. 

 

ఇద్దరికీ తెలిసిన ‘‘ఓ కామన్ ఫ్రెండ్’’ ద్వారా షాబాజ్ ‌ఈ మేరకు సమాచారం ఇచ్చారని చెప్పిన ఇమ్రాన్ ఆ ఫ్రెండ్ ఎవరు అనేది చెప్పలేదు. దీనిపై సమాధానం చెప్పకపోవడంతో ఆయనకు నోటీసులు ఇవ్వాలని కోరడంతో కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: