తెలంగాణలో పదవ తరగతి పరీక్షలపై సందిగ్దత నెలకొంది. పదవ తరగతి పరీక్షల పై నిర్ణయాన్ని హైకోర్టు శనివారానికి వాయిదా వేయగా ఈరోజు విచారణను కొనసాగించారు. అయితే పదో తరగతి విద్యార్థులను  పంజాబ్ తరహాలో పరీక్షలను  నిర్వహించకుండానే విద్యార్థులకు  గ్రేడింగ్ ఇవ్వాల్సిందిగా పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ.  పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే  వచ్చే ఇబ్బంది ఏంటని  హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

 

అదేవిధంగా  విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలు ముఖ్యమా అని నిలదీసింది. దింతో  ప్రభుత్వం తో సంప్రదించి చెబుతానని కేజీ ప్రసాద్ చెప్పడంతో... ప్రభుత్వ నిర్ణయం ఏమై ఉంటుందో తెలుపవలసిందిగా కోర్టు విచారణను నాలుగు గంటలకు  వాయిదా వేసింది. అనంతరం విచారణను కొనసాగించిన కోర్టు పడవ తరగతి  పరీక్షలను జి హెచ్ ఎం సి మరియు రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇది సాధ్యం అయ్యే పని కాదు అని  భావించి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించుకోవాలని నిర్ణయించింది. దీంతో ఈనెల 8 నుంచి జరగవలసిన పదవ తరగతి పరీక్షలు మరోమారు వాయిదా పడ్డాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: