దళిత మహిళా డాక్టర్ అనితా రాణి గారిని వేధించడం దారుణం అంటూ  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. ఆమె పై జరిగింది అమానుష చర్యగా అయన అభివర్ణించారు..ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాడు ..తన ట్విట్టర్ ఖాతా నుండి లోకేష్ ..వైఎస్ జగన్ ని ప్రశ్నిస్తూ ..."గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డ పై వైకాపా గుండాల దాష్టికం. జగన్ గారు అమలు చేస్తున్న రాజా రెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయింది.

 

 

వైకాపా నాయకుల అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ అనితా రాణి గారిని వేధించడం దారుణం. జగన్ గారూ! మీ దిశ చట్టం దిశ తప్పిందా? అన్యాయం జరిగింది అంటూ ఒక దళిత చెల్లెలు పోలీస్ స్టేషన్ కి వెళితే దిశ చట్టం నిందితులకు కొమ్ముకాయడం ఘోరం.చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ ఘటన పై సమగ్ర విచారణ జరపాలి. నిజాయితీగా వృత్తి ధర్మానికి కట్టుబడినందుకు బూతులు తిడుతూ,ఫోటోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలి" అంటూ ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: