ఎంతో మందికి పాఠాలు చెప్పిన గురువు నేడు తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముకుంటూ కనిపించాడు. కరోనా కారణంగా ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణకు తోపుడు బండి పై అరటి పండ్లను అమ్మక తప్పని పరిస్థితి.నెల్లూరు నగరంలోని వేదాయపాళెం గ్రామం లో  ఉంటున్న పట్టెం వెంకటసుబ్బయ్య (ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎంఏ తెలుగు, బీఈడీ పూర్తిచేసి) 2008 నుంచి ప్రైవేటు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

 

 

లాక్‌డౌన్‌ సమయంలో ఆయనతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌ తరగతులను కూడా చెప్పించారు. కొత్త విద్యార్థులను చేర్పించాలనే టార్గెట్‌ చేరుకోలేకపోవడం..స్మార్ట్‌ ఫోన్‌ మరమ్మతులకు గురవడంతో ఆ విద్యా సంస్థ ఆయనను పక్కనపెట్టింది.... దీంతో జీతం రాక..కుటుంబ పోషణ భారమైంది. దీనికి తోడు తన చిన్న కుమారుడి వైద్యానికి గత ఏడాది చేసిన రూ.3.50లక్షల అప్పు చెల్లించాల్సిన పరిస్థితి. చేసేది లేక స్నేహితుల సహాయంతో తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: