స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అద్భుత‌మైన న‌ట‌న‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. త‌న‌దైన డైలాగ్స్‌, డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సౌత్ టాప్ టాప్ నటులలో అల్లు అర్జున్ ఒక‌రు. ఆయ‌న‌కు సోషల్ మీడియాలో కూడా భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్‌కు దాదాపు అన్ని సోషల్ మీడియా వేదిక‌ల్లో ప్రొఫైల్స్ ఉన్నాయి. అయితే.. రోజురోజుకూ పెరుగుతున్న అభిమానుల సంఖ్య‌తో అల్లు అర్జున్ ఎంతో సంతోషంగా ఉన్నాడ‌ట‌.

 

తాజా సంచలనం ఏమిటంటే.. అల్లు అర్జున్ ఫేస్‌బుక్‌లో కొత్త విజయాన్ని సాధించాడు. అల్లు అర్జున్ ఫేస్ బుక్ పేజికి 13 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇదొక స‌రికొత్త రికార్డు. సౌత్ చిత్ర‌ప‌రిశ్ర‌మ నుంచి ఈ రికార్డు సాధించిన మొద‌టి హీరో అల్లు అర్జున్ కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో అల్లు అర్జున్ చాలా సంతోషంగా ఉన్నారు. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: