వ‌చ్చే రెండు, మూడు రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం  ఉపరితల ఆవర్తనం  ప్రభావంతో శనివారంకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసాయి. అరకభద్రలో 7, పెందుర్తిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన త‌ర్వాత‌ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరగనున్నాయి.

 

రానున్న రెండు రోజుల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయి. ఈనెల 9, 10వ‌ తేదీల్లో విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: