మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం హైద‌రాబాద్ సిటీ పోలీసులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. స‌మాజంలో మహిళకు మరింత భద్రత కల్పించి ‘ఆమె’ను విజేతగా నిలిపేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి రూపొందించిన *స్త్రీ* కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ *స్త్రీ*  మహిళలను సమాజంలో విజేతలుగా నిలుపడమే లక్ష్యంగా పని చేస్తుంది.

 

ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సమాన హక్కు కల్పించే దిశగా సమాజాభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: