కాదేదీ కవితకు అనర్హం అని.. కరోనా వైరస్ సోకడానికి ఏదీ అనర్హం కాదంటుంది.  చిన్నా పెద్ద.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు.  ఇప్పటికే కొంత మంది సినీ సెలబ్రెటీలను పొట్టన పెట్టుకుంది కరోనా.  తాజాగా కరోనా మహమ్మారి న్యాయమూర్తులను సైతం వదలడం లేదు. తాజాగా మద్రాస్ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే మరికొందరు సిబ్బంది రిపోర్ట్స్ రావాల్సిఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టుకు తాళం వేశారు.

 

మద్రాస్ హైకోర్టుకు ప్రతి సంవత్సరం ఒక్క రోజు మాత్రం తాళం వేస్తారు. అయితే, ప్రస్తుతం జడ్జిలకు కరోనా సోకడంతో తాళం వేయక తప్పలేదు. దీంతో ఇంటి నుంచే కేసుల విచారణపై జరుపనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ విచారణలకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్‌లకు నియమించిన జడ్జిలు ఇళ్ల నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలు చేపట్టనున్నారు.

 

హైకోర్టు న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుకు న్యాయవాదులు, సిబ్బంది ఇక రావద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.  దీని కోసం కోసం ప్రత్యేకంగా న్యాయమూర్తులు వినిత్‌ కొతారి, సురేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఓ బెంచ్, న్యాయమూర్తులు శివ జ్ఞానం, పుష్పా సత్యనారాయణల నేతృత్వంలో మరో బెంచ్‌ ఏర్పాటు చేశారు 

మరింత సమాచారం తెలుసుకోండి: