దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది. జూన్ చివరి నాటికి ఢిల్లీలో కనీసం లక్ష క‌రోనా కేసులు న‌మోదు అవుతాయ‌ని అంచనా వేస్తోంది. రాజధానిలోని రోగుల అవసరాలను తీర్చడానికి అదనంగా 15 వేల బెడ్ల‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆ క‌మిటీ కోరింది.

 

కమిటీ చైర్మన్ డాక్టర్ మహేష్ వర్మ మాట్లాడుతూ .. అహ్మదాబాద్, ముంబై, చెన్నై వంటి ఇతర నగరాల్లో న‌మోదు అవుతున్న కేసుల‌ను అధ్య‌య‌నం చేశామ‌ని.. దీని ప్ర‌కారం.. జూన్ చివరి నాటికి దేశ రాజధానిలో లక్షకు పైగా కేసులు న‌మోదు అవుతాయ‌ని అన్నారు. వైర‌స్‌ను ఎదుర్కోవడానికి సిద్ధ‌మ‌వుతున్నామ‌ని తెలిపారు. అలాగే.. జూలై 15 నాటికి ఢిల్లీలో 42,000 పడకలు అవసరమవుతాయని మ‌రొక అధికారి వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: