హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట తహసీల్దార్‌ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. తహసీల్దార్‌ సుజాతను అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తహసీల్దార్‌ సుజాత ఇంట్లో రూ.30లక్షలు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.  ఇక ఆమెను 11 గంటలకు విచారణకు రావాలి అని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. 

 

ఇవాళ కూడా ఆమెను అధికారులు విచారించనున్నారు. లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్‌ఐ, బంజారాహిల్స్‌ ఎస్‌ఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సంగతి తెలిసిందే. దీనితో ఆర్‌ఐ నాగార్జున రెడ్డితో పాటుగా ఎస్‌ఐ రవీంద్రనాయక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో వివాదంలో ఉన్న ఎకరం భూమి విషయంలో వీరు లంచం భారీగా డిమాండ్ చేసినట్టు అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: