తమిళనాడులోని రామేశ్వరం వద్ద భారీ తిమింగలం బీచ్ కి కొట్టుకు వచ్చింది. రామనాథపురం జిల్లాలోని అలకంకుళం సమీపంలో అట్రాంకరైలో ఒక తిమింగలం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీనిని గమనించిన అక్కడి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అది మరణించింది అని చెప్పారు. శవపరీక్ష తర్వాత అటవీ అధికారులు బీచ్లో ఖననం చేశారు.
ఇక అది భారీగా ఉంది.. దీనితో క్రేన్ తో దానిని లేపారు అధికారులు. ఇక దీనిని చూడటానికి గానూ పెద్ద ఎత్తున అక్కడి స్థానికులు తరలి వచ్చారు. ఈ తిమింగలం వయసు ఎంత ఉంటుంది అనేది మాత్రం తెలియదు. అక్కడి స్థానికులు దాన్ని తినడానికి ప్రయత్నించినా అది అప్పటికే కుళ్ళిపోయింది అని అధికారులు చెప్పారు.
Rameswaram: A whale was washed ashore in Atrankarai near Alakankulam in Ramanathapuram district. Forest officials later buried it on the beach after an autopsy. #TamilNadu pic.twitter.com/dDZjych0oW
— ANI (@ANI) June 7, 2020