ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ ఆస్పత్రులు కేవలం ఢిల్లీ వారికే అని అయన స్పష్టం చేసారు. కరోనా ఆస్పత్రుల్లో పడకలు సరిపోవడం లేదు అనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను కేవలం ఢిల్లీ ప్రజల కోసమే రిజర్వ్ చేశామని, వారి కోసమే పనిచేస్తాయని ఆయన స్పష్టం చేసారు. 

 

తాము సర్వే చేయగా 90 శాతం మంది ప్రజల అభిమతం కూడా ఇలాగే ఉందన్నారు ఆయన. కేంద్రానికి సంబంధించిన ఆస్పత్రులు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యూరో సర్జరీ లాంటి ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేసే ఆస్పత్రులు మినహా మిగిలిన ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఢిల్లీ వారికే కేటాయించబడతాయన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: