ఆస్ట్రేలియాలో ని ప్ర‌ముఖ న్యూసౌత్‌వేల్స్ కింగ్స్‌క్లిఫ్‌లోని బీచ్‌ స‌ర్ఫింగ్‌కు వెళ్ళగా సొరచేప దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. స‌ర్ఫింగ్‌‌ చేస్తున్న సమయంలో మూడు అడుగులు ఉన్న సొర అతనిపై దాడి చేసింది. ఎడమ కాలు దాని నోటికి చిక్కింది. దానిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాలేదు. ఇక ఎలాగోలా దాని నుంచి తప్పించుకుని... అతను బయటపడ్డాడు. 

 

అటుగా వచ్చిన బోటు రైడర్లు కొందరు అతన్ని తీరానికి తీసుకుని రాగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు అని వారు చెప్పారు. రక్త స్రావం  కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆస్ట్రేలియాలో షార్క్ దాడులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయని బీచ్ కి వెళ్ళే సమయంలో జాగ్రత్తలు పాటించాలి అని అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: