స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆదివారం రోజున అల్లు సిరి ఆపిల్ సిరిని కన్ ఫ్యూజ్ చేస్తున్నాడంటూ అల్లు అర్జున్ వీడియోను పోస్ట్ చేశాడు. అల్లు అయాన్ ఆపిల్ సిరిని నీ పేరేంటి...? అని ఆర్ యు మై అంకుల్...? వెన్ విల్ యూ మ్యారీ...? అని ప్రశ్నలతో గందరగోళానికి గురి చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 
 
అల్లు అర్జునే కాదు అల్లు అయాన్ కూడా దేశముదురే అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. గతంలో కూడా అల్లు అర్జున్ అల్లు అయాన్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: