తెలంగాణాలో పదో తరగతి పరిక్షల విషయంలో స్పష్టత రావడం లేదు. రోజు రోజుకి కేసులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి గాని తగ్గే సూచనలు ఏమీ కనపడటం లేదు. ఇక చూస్తుంటే అటు విద్యార్ధులు కూడా ఇంటర్ కి వెళ్ళే అవకాశాలు కనపడటం లేదు. దీనితో కేసీఆర్ ఏదోక కఠిన నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. 

 

తెలంగాణాలో పదో తరగతి పరిక్షలపై రేపు ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్ష అసమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది. పంజాబ్ మాదిరిగా పరీక్షలను రద్దు చేసి గ్రేడ్ ల ద్వారా విద్యార్ధులను పై తరగతులకు పంపించే ఆలోచన కేసీఆర్ చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై రేపు ఏదోక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: