కర్నూలు జిల్లాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కట్టడి చేయడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుంది గాని ఏ మాత్రం కూడా తగ్గే అవకాశం కనపడటం లేదు. మరో ముంబై అవుతుంది అంటూ పలువురు కామెంట్స్ కూడా చేస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే కర్నూలు జిల్లాలో కఠిన నిర్ణయాలను అమలు చెయ్యాలి అని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కర్నూలులో ఎవరికి మాస్క్ లేకపోయినా 200 కచ్చితంగా ఫైన్ వసూలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ లో కఠిన ఆంక్షలు అమలు చేస్తామని ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా జిల్లా వ్యాప్తంగా కేసులు 761 కి చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: