సరదాగా ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని ప్రసిద్ధ బీచ్‌ కింగ్స్‌క్లిఫ్‌లో సర్ఫర్‌ సర్పింగ్‌ చేస్తున్నాడు.. ఇంతలో అతన్ని మృత్యువు షార్క్ రూపంలో వెంటాడింది.   షార్క్‌ దాడిలో సర్ఫర్‌ మృతిచెందాడు. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సరదాగా సర్పింగ్  కొంత మంది సర్పింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఓ మూడు మీటర్లు ఉన్న షార్క్ ఆ సర్ఫర్ పై దారుంగా ఎటాక్ చేసింది.  ఈ దాడిలో వ్యక్తి కాలు తీవ్రంగా దెబ్బతింది. గమనించిన పలువురు బోర్డు రైడర్లు అతనికి సహాయంగా వచ్చి షార్క్‌తో పోరాడి బాధితుడిని ఒడ్డుకు చేర్చారు.అతనికి వెంనే శస్త్రచికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

 

 మృతుడి వివరాలు స్పష్టంగా తెలియనప్పటికీ క్విన్స్‌ల్యాండ్‌ రాష్ట్రానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. షార్క్‌ దాడి ఘటనలు ప్రపంచంలో ఆస్ట్రేలియాలోనే అత్యధికంగా జరుగుతున్నాయి.  ఇక్కడ ఎంతో భద్రత మద్య సర్ఫింగ్ చేస్తున్నప్పటికీ కొన్ని సార్లు అనుకోకుండా షార్క్ లు వాళ్లపై ఎటాక్ చేయడం జరగుతుందని అంటున్నారు. ఈ ఏడాది షార్క్‌ దాడిలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. గతేడాది 27 షార్క్‌ దాడి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ఎవరూ చనిపోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: