ప్రముఖ కన్నడ హీరో యాక్షన్ కింగ్ అర్జున్‌కు మేనల్లుడు చిరంజీవి సర్జా కన్ను మూశారు. 39 ఏళ్ళ చిరంజీవి గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయారు. చిరంజీవి సర్జాకు ఈ నెల 6న  శ్వాసకోస సమస్య రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఆయన వయసు తక్కువ కావడంతో ఆయనకు హృదయ సంబంధ వ్యాధి అని ఎవరూ ఊహించలేదని వైద్యులు చెప్తున్నారు. 

 

శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడ్డారు అని ఆ తర్వాత చాతి నొప్పి రావడంతో వైద్యం పూర్తి స్థాయిలో అందే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు అని వైద్యులు చెప్తున్నారు. ఆయన పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. 2018 లోనే ఆయనకు నటి మేఘనా రాజ్ తో వివాహం కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: