దేశంలో ఓ వైపు కరోనాతో బాధపడుతుంది.. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు.  జమ్ముకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలోని రిబాన్‌ గ్రామంలో ఉగ్రవాదులున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. మృతుల్లో జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులున్నట్లు భద్రతా దళాలకు చెందిన అధికార వర్గాలు తెలిపాయి.  పక్కా ప్లాన్ తో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 

 

ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, సోపియాన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులు జరిపిన దాడులకు జవాన్లు కూడా దీటుగా బదులివ్వడంతో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు.

 

ఉగ్రవాదులు వైపు నుంచి ఇంకా కాల్పులు కొనసాగడంతో అక్కడ మరికొందరు ఉండవచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను విస్తృతం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: