దేశంలో కరోనా ఎంత విషాదం మిగుల్చుతుందో అంతకన్నా ఎక్కువ సినీ ఇండస్ట్రీలో వరుస స్టార్ నటుల మరణాలు అంతే విషాదాన్ని నింపుతున్నాయి. గత నెల బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు.. మరుసటి రోజే బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ కన్నుమూశారు.  ఆ తర్వాత మరికొంత మంది నటులు కన్ను ముశారు. తాజాగా ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా(39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఆయన మేనల్లుడు. శనివారం (జూన్ 6) చిరంజీవికి శ్వాసకోశ సమస్య రావడంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

IHG'ವಾಯುಪುತ್ರ ...

అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి తీవ్ర ఛాతీ నొప్పి కూడా వచ్చిందని, అందుకే చనిపోయారని వైద్యుల దృవీకరించారు.  మంచి ఫామ్ లో కొనసాగుతున్న ఈ నటుడు కన్నుమూయడం కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. భర్త ఆకస్మిక మృతితో ఆయన భార్య మేఘనా రాజ్ కుప్పకూలిపోయారు.

IHG

కాగా, 2009లో ‘వాయుపుత్ర’ సినిమాతో హీరోగా కన్నడ పరిశ్రమకు చిరంజీవి పరిచయమయ్యారు. ఆకే, సంహారా వంటి దాదాపు 20 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘రాజ మార్తాండ’కు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.  2018లో నటి మేఘనా రాజ్‌ని చిరంజీవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన సోదరుడు ధ్రువ సర్జా కూడా సినిమా ఇండస్ట్రీలోనే నటుడిగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: