తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ఇకనుంచి వారి సొంత జిల్లాల్లోనే చికిత్స అందిస్తామని ప్రకటన చేసింది. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లోనే ఐసోలేషన్ ఏర్పాటు చేస్తామని.... కరోనా లక్షణాలు ఉన్నవారిని హోం క్వారంటైన్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. హోం క్వారంటైన్ లో ఉండేవారిని ఎవరైనా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. 
 
అయితే తాజాగా జియాగూడలో ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. అయితే ఆ వ్యక్తి హోం క్వారంటైన్ లో ఉండేందుకు స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి మంత్రి ఈటల రాజేందర్ కరోనా రోగులకు ఇంట్లో చికిత్స అందిస్తామని... ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: