కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ఉండడంతో లాక్ డౌన్ పేరిట ప్రపంచ దేశాలన్నిటిలో స్కూల్స్ మూతబడ్డాయి. అయితే స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారు అనేవిషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయమై విద్యార్థుల తల్లి తండ్రులు , విద్యార్థులు మరియు పాఠశాల యాజమాన్యం పెద్ద సందిగ్ధం లో ఉన్నారు. అయితే వీటన్నిటికీ సమాధానంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ ఫాబ్రియాల్  స్కూల్ రీ-ఓపెనింగ్ పై ఓ క్లారిటీ ఇచ్చారు.  ఆగస్టు తరువాతే పాఠశాలలు రీ ఓపెన్ అవుతాయని అయన తెలిపారు. అయితే దేశం లో దాదాపుగా 34 కోట్ల మంది విద్యార్థులు వున్నారు.

 

విరాంతకుడా స్కూల్స్ ఎప్పుడు రీ-ఓపెనింగ్ అవుతాయని ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా కేంద్రపరభుత్వం లాక్ డౌన్ లో 5 మార్గదర్శకాలతో స్కూల్స్ రీ-ఓపెనింగ్ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇందులో కేవలం అప్పర్ ప్రైమరీ తరగతులు అనగా 8 తరగతి పైన ఉన్న తరగతులను నడపడానికి అనుమతి లభిస్తుంది అదేవిధంగా ఎనిమిదవ తరగతి కంటే తక్కువ తరగతులకు స్కూల్ కి వచ్చే అనుమతి లేదు. అయితే ప్రొదున్న మరియు మధ్యాహ్నం లలో బ్యాచ్ వారీగా తరగతులను నిర్వహించేందుకు ప్లాన్చేస్తున్నారు అధికారులు. గ్రీన్ మరియు ఓరేంజ్ జోన్ల లో ఉండే స్కూల్స్ ని ప్రారంభించనున్నారు అధికారులు. ఈలెక్కన ఆగస్టు నాటికీ స్కూల్స్ మొత్తం తెరుచుకునే అవకాశం ఉందంటున్నారు అధికారులు 

మరింత సమాచారం తెలుసుకోండి: