ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తమ గ్రామంలో క్వారంటైన్ సెంటర్ను తొలగించాలి అంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడలో గ్రామస్తులు వ్యతిరేకించడంతో పోలీసులు మరియు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాడేపల్లి మండలం గుండిమెడలో ప్రభుత్వం వారు క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు అందులో 30 మంది కరోనా రోగులను మరియు సిబ్బందిని ఇంకా పోలీస్ సిబ్బంది ని ఏర్పాటు చేశారు. అయితే తమ గ్రామంలో క్వారంటైన్ సెంటర్ నిర్వహించవద్దని గ్రామస్తులు అడ్డుకున్నారు.

 

ఈ విషయమై గ్రామస్తులకు మరియు పోలీస్ లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో అదికాస్తా ఘర్షణకు దారితీసింది.ఈ ఘటనలో గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీస్ లకు మరియు కరోనా రోగులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామం అంతకుడా వేడెక్కింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ దాడివెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ నాయకులూ అంటున్నారు. ఈ దాడికి టీడీపీ నేత కొమ్మారెడ్డి కిరణ్‌ కుట్రపన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: